OPPO Reno 12, 12 Pro గ్లోబల్ వేరియంట్స్ స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో గ్లోబల్‌గా OPPO Reno 12 సిరీస్ లాంచ్
  • ఇప్పటికే చైనాలో లాంచైన రెనో 12 సిరీస్
  • గ్లోబల్‌ వేరియంట్స్‌లో విభిన్నమైన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం తన హోమ్ మార్కెట్ చైనాలో Reno 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెనో 12, రెనో 12 ప్రో ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అప్పటి నుంచి గ్లోబల్ లాంచ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే గ్లోబల్ వేరియంట్స్ స్పెసిఫికేషన్స్, చైనా వేరియంట్స్ మాదిరి ఉండబోవని తాజాగా లీక్ ద్వారా తెలుస్తోంది. మరి ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

ప్రాసెసర్: చైనాలో లాంచైన ఒప్పో రెనో 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్ వాడగా, రెనో 12 ప్రో డివైజ్ లో డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. కానీ, భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కాబోయే రెనో 12, రెనో 12 ప్రో డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.

కెమెరా: రెనో 12 సిరీస్ చైనా మోడల్స్ లో 50ఎంపి + 50ఎంపి + 8ఎంపి రియర్ కెమెరా సెటప్ ఉంది. గ్లోబల్ వేరియంట్స్ లో 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా సెటప్ ఉంటుందని తాజాగా లీక్ ద్వారా తెలిసింది. రెనో 12 ప్రో చైనా వేరియంట్ లో 50ఎంపి ఐఎంఎక్స్890 సెన్సర్ ఇవ్వగా, గ్లోబల్ వేరియంట్ లో మాత్రం 50ఎంపి ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

OPPO Reno 12 Pro ధర

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 580 యూరోలుగా ఉంటుందని సమాచారం. భారత కరెన్సీలో దీన్ని సుమారు రూ.52,000 అని చెప్పవచ్చు. చైనా మోడల్ విషయానికి వస్తే, ఇదే మెమొరీ వేరియంట్ ధర అక్కడ 3699 యువాన్లు (సుమారు రూ.43,200) గా ఉంది. ఇక భారత్ లో 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.40 వేల లోపు పెట్టే అవకాశం ఉంది.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G ఫోన్లలో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 1.5కే డిస్ప్లే, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.1GHz. OPPO Reno 12 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.35GHz. బేస్ మోడల్ లో మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఇచ్చారు. ప్రో మోడల్ లో ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ ఇచ్చారు.

రియర్ కెమెరా: OPPO Reno 12 5G లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 మెయిన్ కెమెరా, 50ఎంపి సోని జెఎన్5 2x టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

OPPO Reno 12 Pro 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 2x టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G స్మార్ట్‌ఫోన్లలో 20x డిజిటల్ జూమ్ మరియు ఓఐఎస్ ఫీచర్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G డివైజెస్ లో 50ఎంపి శాంసంగ్ జెఎన్5 ప్రైమరీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్లు 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి.

కనెక్టివిటీ: OPPO Reno 12 సిరీస్ లోని రెండు ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.