ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో రెనో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO Reno 12FS పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానున్నట్లు సమాచారం. ఇకపోతే రెనో 12 సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. మరి ఈ 12ఎఫ్ఎస్ ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి. అయితే తాజాగా ఈ ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. 32ఎంపి సెల్పీ కెమెరా, 12జిబి ర్యామ్ తో 12ఎఫ్ఎస్ డివైజ్ లాంచ్ కానుంది. ఓసారి ఈ ఫోన్ యొక్క లీకైన వివరాలు తెలుసుకుందాం పదండి.
OPPO Reno 12FS 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: OPPO Reno 12FS 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2.5డి అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
ప్రాసెసర్: OPPO Reno 12FS 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.
ఓఎస్: OPPO Reno 12FS 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవ్వనుంది.
మెమొరీ: OPPO Reno 12FS 5G డివైజ్ 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 512జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. మెమొరీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
కెమెరా: OPPO Reno 12FS 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓవిడీ50డీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: OPPO Reno 12FS 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: OPPO Reno 12FS 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి.
