
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 12 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro మోడల్స్ లాంచ్ కానున్నాయి. అయితే ఇంకా ఈ ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సమయం ఉంది. ఈలోపు టాప్ వేరియంట్ OPPO Reno 12 Pro యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Reno 12 Pro యొక్క స్పెసిఫికేషన్స్ ని చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.
లీక్ ప్రకారం, OPPO Reno 12 Pro డివైజ్ 6.7-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ తో వస్తోంది.
OPPO Reno 12 Pro తో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుందని సమాచారం.
OPPO Reno 12 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి 2ఎక్స్ పొట్రెయిట్ లెన్స్, 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.
OPPO Reno 12 Pro లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
OPPO Reno 12, OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్లు జూన్ 2024 లో లాంచ్ అవుతాయని MSPowerUser రివీల్ చేసింది.
OPPO Reno 12 డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తుందని సమాచారం.
OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Reno 11 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందించారు.
- ప్రాసెసర్: OPPO Reno 11 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, మాలి-జీ610 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11 Pro లో 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ + 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
- కెమెరా: OPPO Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: OPPO Reno 11 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- ఓఎస్: OPPO Reno 11 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: OPPO Reno 11 Pro డివైజ్ 162.4 మి.మీ పొడవు, 74.1 మి.మీ వెడల్పు, 7.59 మి.మీ మందం (రాక్ గ్రే), 7.6 మి.మీ మందం (పర్ల్ వైట్), 181 గ్రాముల బరువు ఉంటుంది.











