Home News OPPO: బీఐఎస్‌పై లిస్టైన Reno 12 Pro, త్వరలో భారత్‌లో లాంచ్

OPPO: బీఐఎస్‌పై లిస్టైన Reno 12 Pro, త్వరలో భారత్‌లో లాంచ్

Highlights
  • త్వరలో OPPO Reno 12 Pro లాంచ్
  • డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్
  • SDPPI లిస్టింగ్ మోడల్ నంబర్ CPH2629

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో Reno 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా OPPO Reno 12 Pro ఫోన్ భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు ఎస్డీపీపీఐ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 Pro సర్టిఫికేషన్ వివరాలు

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ ఎస్టీపీపీఐ సర్టిఫికేషన్ పై CPH2629 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 12 Pro యొక్క పేరు కూడా ఈ లిస్టింగ్ పై స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఫోన్ బీఐఎస్, ఐఎండీఏ, ఈఈసీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పై కూడా ఇదే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో OPPO Reno 12 Pro త్వరలోనే భారత్ లో లాంచ్ అవ్వనుందని స్పష్టమైంది.

టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ లిస్టింగ్ పై ఒప్పో రెనో 12 ప్రో 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 12 Pro కెమెరా ఎఫ్‌వీ 5 లిస్టింగ్

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ Camera FV-5 డేటాబేస్ పై కూడా లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, OPPO Reno 12 Pro ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, ఈఐఎస్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.

కెమెరా: OPPO Reno 12 Pro లో 50ఎంపి పొట్రెయిట్ 2x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.