ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన హోమ్ మార్కెట్ చైనాలో నేడు రెనో 12 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఆకట్టుకునే లుక్స్, ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఓసారి ఈ ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
OPPO Reno 12 సిరీస్ ధర
OPPO Reno 12 డివైజ్ నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
OPPO Reno 12 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2699 యువాన్లు (సుమారు రూ.31,599) గా నిర్ణయించారు.
OPPO Reno 12 12జిబి+512జిబి మోడల్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,500)
OPPO Reno 12 16జిబి+256జిబి వేరియంట్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,500)
OPPO Reno 12 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 3199 యువాన్లు (సుమారు రూ.36,699) గా పెట్టారు.
OPPO Reno 12 5G డివైజ్ చైనాలో మిలీనియమ్ సిల్వర్, సాఫ్ట్ పీచ్ మరియు ఎబోనీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OPPO Reno 12 Pro 5G ధర
12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3399 యువాన్లు (సుమారు రూ.39,000)
12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3699 యువాన్లు (సుమారు రూ.43,199).
16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.46,799).
OPPO Reno 12 Pro చైనాలో సిల్వర్ ఫ్యాంటసీ పర్పుల్, షాంపేన్ గోల్డ్ మరియు ఎబోనీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లను కొనే వారికి ఒప్పో కంపెనీ ఉచితంగా బ్లూటూత్ హెడ్‌సెట్ అందిస్తోంది.
OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G ఫోన్లలో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 1.5కే డిస్ప్లే, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
ప్రాసెసర్: OPPO Reno 12 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.1GHz. OPPO Reno 12 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.35GHz. బేస్ మోడల్ లో మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఇచ్చారు. ప్రో మోడల్ లో ఇమ్మోర్టాలిస్-జీ715 జీపీయూ ఇచ్చారు.
రియర్ కెమెరా: OPPO Reno 12 5G లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 మెయిన్ కెమెరా, 50ఎంపి సోని జెఎన్5 2x టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
OPPO Reno 12 Pro 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 2x టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G స్మార్ట్‌ఫోన్లలో 20x డిజిటల్ జూమ్ మరియు ఓఐఎస్ ఫీచర్ ఉన్నాయి.
ఫ్రంట్ కెమెరా: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro 5G డివైజెస్ లో 50ఎంపి శాంసంగ్ జెఎన్5 ప్రైమరీ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: OPPO Reno 12 5G మరియు OPPO Reno 12 Pro డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్లు 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి.
కనెక్టివిటీ: OPPO Reno 12 సిరీస్ లోని రెండు ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
OPPO Reno 12 సిరీస్ ఫోన్లు ఐపీ65 రేటింగ్ తో వచ్చాయి. అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ కెపాసిటీ ఈ ఫోన్లకు ఉంది.
