OPPO: లీకైన OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 12 సిరీస్
  • జూన్ 2024 లో లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా లీకైన OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని వారాల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఆ తర్వాత ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Reno 12 సిరీస్ కి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. తాజాగా MSPowerUser OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro మోడల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. OPPO Reno 12 Pro మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి లీకైన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ గ్లాస్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: OPPO Reno 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సెకండరీ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయని సమాచారం.
  • బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: స్టాండర్డ్ మోడల్ OPPO Reno 12 లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ డివైజ్ MTK 24M అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 50ఎంపి ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.

OPPO Reno 12 సిరీస్ లాంచ్ వివరాలు

  • OPPO Reno 12 సిరీస్ 2024 జూన్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
  • OPPO Reno 12 సిరీస్ కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడవ్వాల్సి ఉంది. డిజిటల్ చాట్ స్టేషన్ తన గత లీక్ లో OPPO Reno 12 సిరీస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్ తో వస్తుందని అంచనా వేసింది.
  • OPPO Reno 12 సిరీస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ పై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO Reno 12 సిరీస్ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 12 సిరీస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్స్ ఉంటాయని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 సిరీస్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.
  • కెమెరా: OPPO Reno 12 సిరీస్ డివైజెస్ లో 50ఎంపి + 50ఎంపి + 8ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం.
  • బ్యాటరీ: OPPO Reno 12 సిరీస్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 12 సిరీస్ ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తుందని భావిస్తున్నారు.
Previous articleRealme: TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన Realme 12+ 5G స్పెసిఫికేషన్స్
Next articleVivo: 50MP కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo V30
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.