Home News OPPO Reno 12F 5G: గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ పొందిన రెనో 12ఎఫ్ 5జీ

OPPO Reno 12F 5G: గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ పొందిన రెనో 12ఎఫ్ 5జీ

Highlights
  • త్వరలో OPPO Reno 12F 5G లాంచ్
  • యూరప్ లాంచ్ తేదీ జూన్ 18
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2637

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెనో సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO Reno 12F 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో జూన్ 18వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO Reno 12F 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2637 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 12F 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 677 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1415 పాయింట్లు స్కోర్ చేసింది.

OPPO Reno 12F 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ పై కనిపించిన వివరాల ద్వారా తెలుస్తోంది.

OPPO Reno 12F 5G లో మాలి జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయని గీక్‌బెంచ్ లిస్టింగ్ పై ఉంది.

ఇంకా గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి.

OPPO Reno 12F 5G డివైజ్ గతంలో టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

అంతేకాదు, భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై OPPO Reno 12F 5G డివైజ్ లిస్ట్ అయ్యింది.

అయితే OPPO Reno 12F 5G డివైజ్ భారత్ లో వేరు పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా, OPPO Reno 11F 5G ఫోన్ OPPO F25 Pro పేరుతో ఇండియాలో లాంచ్ అయ్యింది. త్వరలోనే ఇండియా లాంచ్ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.