హైలైట్స్:
- జులై 18 న భారత్ లో లాంచ్ కానున్న ఒప్పో రెనో 8 సిరీస్
- మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రత్యేకతలు
- నెట్టింట్లో ప్రత్యక్షమైన ఒప్పో రెనో 8 లైవ్ ఇమేజెస్
ఒప్పో రెనో 8 సిరీస్ జులై 18 న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఒప్పో రెనో 8 మరియు ఒప్పో రెనో 8 ప్రో మోడల్స్ ఉంటాయి. ఒప్పో రెనో 8 ప్రో+ వేరియంట్ భారత్ కి రావడం లేదు. ఇది చైనాలో మే నెల్లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు లాంచ్ కి ముందు టిప్ స్టర్ ముకుల్ శర్మ ఒప్పో రెనో 8 5జీ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్లను రివీల్ చేశాడు.
CNY 2,499 (రూ.29,500) ధరతో ఒప్పో రెనో 8 8జిబి+128జిబి వేరియంట్ చైనాలో లాంచ్ అయ్యింది. ఒప్పో రెనో 8 ప్రో (చైనా వేరియంట్) ఒప్పో రెనో 8 గా, ఒప్పో రెనో 8 ప్రో+ (చైనా వేరియంట్) ఒప్పో రెనో 8 ప్రో గా భారత్ లో లాంచ్ అవుతున్నాయి. మరి ఒప్పో రెనో 8 యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్ వేద్దాం పదండి.
Oppo Reno 8 5G లైవ్ ఇమేజెస్
[Exclusive] OPPO Reno8 5G Indian variant hands-on images.#OPPO #OPPOReno85G pic.twitter.com/oCbypTQUGw
— Mukul Sharma (@stufflistings) July 13, 2022
టిప్ స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన ఒప్పో రెనో 8 5జీ యొక్క లైవ్ పిక్స్ ద్వారా డిజైన్, కెమెరా బంప్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫోన్ టాప్ లెఫ్ట్ కార్నర్ లో పంచ్-హోల్ కటౌట్, థిన్ బెజెల్స్, బాటమ్ లో మందంగా ఉన్న చిన్, కుడివైపు పవర్ బటన్, వెనుకాల ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్, బాటమ్ రైట్ కార్నర్ లో ఒప్పో బ్రాండింగ్ ఉన్నాయి.
Oppo Reno 8 5G స్పెసిఫికేషన్స్
ఒప్పో రెనో 8 5జీ ఫోన్లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12.1 స్కిన్ వంటి ఫీచర్లున్నాయి.
ఒప్పో రెనో 8 5జీ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32ఎంపి కెమెరా అమర్చారు. ఇక వెనుక వైపున ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీంట్లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఇక భద్రత కోసం ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అందించారు.