OPPO Reno 8T 5G ఇండియా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఒప్పో ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అలాగే OPPO Reno 8T 5G యొక్క డిజైన్ ని కూడా ఒప్పో తన లేటెస్ట్ కమర్షియల్ యాడ్ వీడియో ద్వారా టీజ్ చేసింది. టీజర్ వీడియో ద్వారా ఫోన్ రియర్ ప్యానెల్ లుక్ రివీల్ అయ్యింది. దీంతో కొన్ని రోజుల క్రితం నెట్టింట్లో ప్రత్యక్షమైన డిజైన్ కన్ఫర్మ్ అయ్యినట్లైంది. OPPO Reno 8T 5G ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. సెన్సర్స్ తో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
లీకైన ధర వివరాలను బట్టి, OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ ప్రీమియమ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అని అర్థమవుతోంది. ఓసారి OPPO Reno 8T 5G యొక్క ఇండియా లాంచ్ తేదీ, లీకైన ధర వివరాలు, స్పెసిఫికేషన్స్ తదితర సమాచారాన్ని తెలుసుకుందాం పదండి.
OPPO Reno 8T 5G: లాంచ్‌కి ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
ఫిబ్రవరి 3 న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. రెనో 8 5జీ ఫోన్ కంటే కాస్త పై శ్రేణిలో OPPO Reno 8T 5G ఉంటుంది. ఫిబ్రవరి 3 న ఒప్పో సంస్థ OPPO Reno 8T 5G యొక్క ధర వివరాలను రివీల్ చేయనుంది. OPPO Reno 8T 5G ఫోన్ డ్యూయల్ సర్క్యులర్ కటౌట్స్ తో వస్తోంది. ఇందులో 3 కెమెరాలు ఉంటాయి.
OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్, రిలాక్స్డ్ గ్రిప్ మరియు ఇమ్మెర్సివ్ విజువల్స్ మధ్య ఫర్ఫెక్ట్ బ్యాలన్స్ ని కలిగిన ఆల్-రౌండ్ ప్రీమియమ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. టీజర్ వీడియో ద్వారా సన్‌రైజ్ గోల్డ్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యింది. రీసెంట్ లీక్ ద్వారా, OPPO Reno 8T 5G ఇండియా వేరియంట్ డైనమిక్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుందని తెలిసింది.
OPPO Reno 8T 5G ఫోన్ లో 108ఎంపి కెమెరా, అల్ట్రావైడ్ కెమెరాకి బదులు, 2ఎంపి మైక్రోస్కోప్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
OPPO Reno 8T 5G లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉండనుంది. OPPO Reno 8T 5G లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉండదు. అయితే ఈ ఫోన్ డ్యూయల్ స్పీకర్స్ తో వస్తోంది.
OPPO Reno 8T 5G ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,990 ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
