హైలైట్స్
- ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్
- 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోన్న OPPO Reno 8T 5G డివైజ్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో రానున్న OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారత్ లో త్వరలో ఒక ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రెనో సిరీస్ లో ఈ ఫోన్ వస్తోంది. MySmartPrice ప్రకారం, ఒప్పో నుంచి వచ్చే నెలలో భారత్ లో OPPO Reno 8T 5G ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
అయితే ఈ ఫోన్ OPPO F23 5G గా రీబ్రాండ్ అయి భారత్ కి రానున్నట్లు గతంలో ఓ వార్త వినిపించింది. అయితే తాజాగా అది నిజం కాదని తేలింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ వేరు వేరుగా భారత్ లో లాంచ్ కానున్నట్లు తాజాగా ఓ సమాచారం బయటకు వచ్చింది. ఈ ఫోన్ ఫిబ్రవరి మొదటి వారంలో భారత్ లో లాంచ్ కానుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా తెలిసింది. ఇంకా ఈ ఫోన్ ధర రూ.32,000 గా ఉండే అవకాశం ఉందని ముకుల్ అంచనా వేశారు.
OPPO Reno 8T 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)
OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి మొదటి వారంలో భారత్ లో లాంచ్ కానుంది. అయితే, టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం, ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఏదీ పేర్కొనబడలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
భారత్ లో OPPO Reno 8T 5G ధర, ర్యామ్, స్టోరేజీ (అంచనా)
భారత్ లో OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.32,000 గా ఉండనుందని అంచనా. అయితే టిప్‌స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో భారత్ లో లాంచ్ కానుంది. అయితే ఇతర ఆప్షన్స్ కూడా ఉండనున్నాయి.
OPPO Reno 8T 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ 10-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. OPPO Reno 8T 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుంది. ఇది 5జీ చిప్సెట్.
OPPO Reno 8T 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OPPO Reno 8T 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
OPPO Reno 8T యొక్క 4జీ వేరియంట్ కూడా రానుందని సమాచారం. ఈ 4జీ వేరియంట్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో రానుంది. ఇకపోతే ఈ హ్యాండ్సెట్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











