Home News 100ఎంపి కెమెరా, 90హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న OPPO Reno 8T?

100ఎంపి కెమెరా, 90హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న OPPO Reno 8T?

Highlights
  • రెనో-8 సిరీస్ ని విస్తరించే ఆలోచనలో ఉన్న ఒప్పో సంస్థ
  • త్వరలోనే Reno 8T ఫోన్ ని లాంచ్ చేయనున్న ఒప్పో
  • 100ఎంపి కెమెరా, అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న OPPO Reno 8T

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO, Reno 8 సిరీస్ ని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. OPPO Reno 8T ఫోన్ త్వరలోనే లాంచ్ అవ్వబోతోంది. ఈలోపు ఈ హ్యాండ్సెట్ కి సంబంధించిన సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ టిప్ స్టర్ ద్వారా OPPO Reno 8T యొక్క స్పెక్ షీట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం, OPPO Reno 8T ఫోన్ 6.43-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OPPO Reno 8T స్పెసిఫికేషన్స్ (అంచనా)

టిప్‌స్టర్ స్నూపీటెక్ OPPO Reno 8T కి సంబంధించిన స్పెక్ షీట్ ని ఈ వారం మొదట్లో షేర్ చేశాడు. దీంతో ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. OPPO Reno 8T ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 100 ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మైక్రో లెన్స్, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఉండనున్నాయి. ఈ హ్యాండ్సెట్ 32ఎంపి సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఈ ఫోన్ లో విజువల్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీఎక్స్54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోందని సమాచారం. వీటితో పాటు, టిప్‌స్టర్ OS వివరాలను కూడా షేర్ చేశాడు. OPPO Reno 8T ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

కొన్ని రోజుల క్రితం మరొక టిప్‌స్టర్ ముకుల్ శర్మ ద్వారా OPPO Reno 8T యొక్క ధర, లాంచ్ తేదీ వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఫిబ్రవరి మొదటి వారంలో OPPO Reno 8T స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ.32,000 ఉండనుందని టిప్‌స్టర్ అంచనా వేశాడు. ఇక OPPO Reno 8T ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.