12GB ర్యామ్, కర్వ్డ్ డిస్ప్లే తో లాంచ్ అయిన OPPO Reno 9

హైలైట్స్

  • చైనాలో లాంచ్ అయిన OPPO Reno 9 సిరీస్
  • లైనప్ లో ఉన్న మోడల్స్: OPPO Reno 9, OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, డ్యూయల్-కోర్ పొట్రెయిట్ తో లాంచ్ అయిన OPPO Reno 9

అందరూ ఎదురు చూసిన సమయం వచ్చేసింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు చైనాలో OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం మూడు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+. మూడు ఫోన్లు కూడా కర్వ్డ్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్-హోల్ కటౌట్ కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. డివైజెస్ ని చూస్తుంటే ప్రీమియమ్ గా కనిపిస్తున్నాయి.

OPPO Reno 9 విషయానికి వస్తే, ఇది రెనో సిరీస్ లో బేస్ వేరియంట్. కర్వ్డ్ డిస్ప్లే తో OPPO Reno 9 రావడం విశేషం. ఈ రకం డిస్ప్లే ఫోన్ కి మంచి లుక్ తీసుకొచ్చింది. OPPO Reno 9 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా, డ్యూయల్-కోర్ పొట్రెయిట్ ఫీచర్, స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్ తో వచ్చింది. OPPO Reno 9 టుమారో గోల్డ్, బ్లాక్, స్లైట్లీ డ్రంక్ అనే మూడు కలర్ వేరియంట్స్ లో లభించనుంది.

OPPO Reno 9 స్పెసిఫికేషన్స్

OPPO Reno 9 స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, బిలియన్ కలర్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ మూడు వైపులా బెజెల్స్ లేకుండా వచ్చింది. బాటమ్ లో 2.3 ఎంఎం చిన్ మాత్రమే ఉండటం విశేషం.

ఇప్పుడు OPPO Reno 9 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OPPO Reno 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

OPPO Reno 9 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OPPO Reno 9 డివైజ్ 174 గ్రాముల బరువు, 7.19 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ డివైజ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీఎన్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OPPO Reno 9 ధర

OPPO Reno 9 డివైజ్ మొత్తం 3 వేరియంట్లలో లభిచనుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ. వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

  • 8జిబి + 256జిబి ధర – CNY 2499 (సుమారు రూ.28,571)
  • 12జిబి + 256జిబి ధర – CNY 2699 (సుమారు రూ.30,858)
  • 12జిబి + 512జిబి ధర – CNY 2999 (సుమారు రూ.34,288)

Note: ఈ వార్తను తమిళంలో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.