హైలైట్స్
- చైనాలో లాంచ్ అయిన OPPO Reno 9 సిరీస్
- 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 5జీ కనెక్టివిటీ, 512జిబి స్టోరేజీతో లాంచ్ అయిన OPPO Reno 9 సిరీస్ ఫోన్లు
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ OPPO Reno 9 Pro+

OPPO Reno 9 Pro విషయానికి వస్తే, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇక్కడ OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+ డివైజెస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధరల వివరాలు అందిస్తున్నాం. ఓసారి చదివేయండి. OPPO Reno 9 గురించి తెలుసుకోవాలనుంటే ఇక్కడ చదవండి.
OPPO Reno 9 Pro స్పెసిఫికేషన్స్, ధర
OPPO Reno 9 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీఆర్10+, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ ని కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఇందులో Mali-G610 MC6 జీపీయూ వాడారు. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ తో లభిస్తుంది.
OPPO Reno 9 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5G SA/NSA, వై-ఫై, బ్లూటూత్ 5.3, యూట్యూబ్ టైప్-సీ, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
ఇప్పుడు OPPO Reno 9 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ షూటర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
OPPO Reno 9 Pro 16జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 3,499 (సుమారు రూ.40,000), 16జిబి + 512జిబి యూనిట్ ధర RMB 3,799 (సుమారు రూ.43,500) గా ఉంటుంది.
OPPO Reno 9 Pro+ స్పెసిఫికేషన్స్
OPPO Reno 9 Pro+ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 240 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీఆర్10+, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం Adreno 730 GPU వినియోగించారు. 16జిబి/256జిబి మరియు 16జిబి/512జిబి ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
OPPO Reno 9 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. OPPO Reno 9 Pro+ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
OPPO Reno 9 Pro+ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
OPPO Reno 9 Pro+ ఫోన్ 16జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 3,999 (సుమారు రూ.45,700), 16జిబి + 512జిబి యూనిట్ ధర RMB 4,399 (సుమారు రూ.50,300) గా ఉన్నాయి. ఈ డివైజ్ గోల్డ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













