హైలైట్స్:
- రెనో 8 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న OPPO Reno 9 సిరీస్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 సిరీస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ చిప్సెట్స్ తో వస్తున్న OPPO Reno 9 సిరీస్
- యూనివర్శల్ ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్ (UFCS) ని అడాప్ట్ చేసుకున్న తొలి కంపెనీ OPPO
OPPO కంపెనీ కొన్ని నెలల క్రితం Reno 8 సిరీస్ ని భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది. త్వరలోనే OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేయాలని ఒప్పో సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. OPPO Reno 9 సిరీస్ నవంబర్ నెలలో ఎంట్రీ ఇవ్వనుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station చైనీస్ సోషల్ మీడియా మాధ్యమం Weibo లో OPPO Reno 9 సిరీస్ కి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ఆ లీక్ ప్రకారం, OPPO Reno 9 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 సిరీస్ చిప్సెట్స్ తో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
సరికొత్త UFCS (యూనివర్శల్ ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్) ని అడాప్ట్ చేసుకున్న తొలి కంపెనీగా ఒప్పో నిలవనుంది. ఇది గరిష్టంగా 40వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగిన ఏకీకృత చార్జింగ్ స్టాండర్డ్. Reno 9 సిరీస్ UFCS సపోర్ట్ కలిగిన 4500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
OPPO Reno 9 సిరీస్
OPPO Reno 9 సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7, మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ చిప్సెట్స్ తో లాంచ్ అవుతోంది. రెనో 8 సిరీస్ కూడా ఇదే విధంగా వచ్చింది. OPPO Reno 9 సిరీస్ యూఎఫ్‌సీఎస్ స్టాండర్డ్ తో వస్తోంది. ప్రస్తుతం దీని ద్వారా 40 వాట్ చార్జింగ్ కెపాసిటీతో చార్జ్ చేయవచ్చు. ఈ వివరాలు కాకుండా ఇంకా వేరే ఇతర విషయాలు ప్రస్తుతానికి తెలియలేదు. రానున్న రోజుల్లో OPPO Reno 9 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
UFCS స్టాండర్డ్ అంటే ఏమిటి?
UFCS అంటే ‘యూనివర్శల్ ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్’. విభిన్న బ్రాండ్స్ కి చెందిన పలు రకాల డివైజెస్ కి సపోర్ట్ చేసే యాక్ససరీలను తయారు చేసే విధానమే ఈ UFCS. ఇప్పటికే చైనా కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అసోసియేషన్ 11 ఫాస్ట్ చార్జింగ్ సర్టిఫికేషన్స్ యొక్క మొదటి బ్యాచ్ ని రిలీజ్ చేసింది. కన్సార్టియమ్ మెంబర్స్ సర్టిఫికేషన్స్ కి ఆమోదం తెలిపారు.
ప్రస్తుతం కొత్త స్టాండర్డ్ ఐదు మేజర్ చార్జింగ్ టెక్నాలజీ లను ప్రమోట్ చేయనుంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్స్ ని ఇంప్రూవ్ చేయనుంది. తద్వారా పలు రకాల అప్లికేషన్స్ కి సపోర్ట్ ఇచ్చే విధంగా మార్పు చెందనుంది. ఆ విధంగా ఒకే రకమైన ఏకీకృత విధానాన్ని ఇండస్ట్రీ స్థాయిలో వాలిడ్ అయ్యేలా చేయడమే ప్రథమ లక్ష్యం. త్వరలోనే యూసీఎస్ స్టాండర్డ్ ని అన్ని బ్రాండ్స్ అడాప్ట్ చేసుకునేలా ప్రమోట్ చేయనున్నారు. ఈ యూఎఫ్‌సీఎస్ స్టాండర్డ్ కోసం హువావే, ఒప్పో, వివో, షావోమీ కలిసి పని చేస్తున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.













