Snapdragon 778G ప్రాసెసర్ తో వస్తోన్న OPPO Reno 9

హైలైట్స్:

  • త్వరలోనే Reno 8 సిరీస్ సక్సెసర్ Reno 9 సిరీస్ ని లాంచ్ చేయనున్న OPPO
  • Snapdragon 778G చిప్ తో రానున్న Reno 9 సిరీస్, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో వస్తుందని ఇది వరకు వచ్చిన ఊహాగానాలు
  • UFCS (Universal Fast Charging Specification) స్టాండర్డ్ తో వస్తున్న Reno 9 సిరీస్

Reno 8 సిరీస్ లాంచ్ తర్వాత Reno 9 సిరీస్ పై ఒప్పో కంపెనీ దృష్టి పెట్టింది. ఇదివరకు ఒప్పో Reno 9 సిరీస్ యొక్క చార్జింగ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. తాజాగా ఈ లైనప్ యొక్క చిప్సెట్ ఏంటో తెలిసింది. Weibo ద్వారా ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station షేర్ చేసిన సమాచారాన్ని బట్టి, ఒప్పో Reno 9 సిరీస్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 7 జెన్ 1 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తుందని ఇదివరకు భావించారు. కానీ తాజాగా 778జి చిప్సెట్ సీన్ లోకి వచ్చింది.

Reno 9 సిరీస్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం. ఇది UFCS సపోర్ట్ తో వస్తోంది. UFCS స్టాండర్డ్ ని అడాప్ట్ చేసుకున్న తొలి స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో కావడం విశేషం. అయితే రెనో 8 సిరీస్ లో ఉన్న 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో పోల్చితే Reno 9 సిరీస్ లో అందించిన 40వాట్ చార్జింగ్ చాలా తక్కువ.

Reno 9 సిరీస్ ప్రాసెసర్

తాజాగా బయటకు వచ్చిన లీక్స్ ని బట్టి, Reno 9 సిరీస్ లో కాస్త పాతదైన Snapdragon 778G చిప్సెట్ ని వాడనున్నట్లు తెలుస్తోంది. Snapdragon 7 Gen 1 చిప్ లేదా MediaTek Dimensity 800 సిరీస్ చిప్ ని Reno 9 సిరీస్ లో వినియోగిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం Snapdragon 7 Gen 1 చిప్ కేవలం Reno 8 Pro చైనా వేరియంట్ మరియు Xiaomi Civi 2 ఫోన్ల లోనే ఉంది. అలాగే కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే అమ్ముడయ్యే పలు హ్యాండ్సెట్స్ లో ఈ చిప్సెట్ ఉంది.

న్యూ జనరేషన్ చిప్సెట్స్ తో ఫోన్లు లాంచ్ అవుతోన్న తరుణంలో Reno 9 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్ వాడటం కచ్చితంగా డౌన్‌గ్రేడ్ అనే చెప్పాలి. మరి ఈ వార్త నిజమైతే, లాంచ్ తర్వాత కస్టమర్ల నుంచి ఈ ఫోన్ కి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

ఇక Snapdragon 778G చిప్సెట్ విషయానికి వస్తే, ఇదొక 5జీ ప్రాసెసర్. 2.4 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి, గేమ్స్ ఆడేందుకు ఈ ప్రాసెసర్ బాగానే పని చేస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాసెసర్ మంచి ఫలితాలనే ఇచ్చింది. అయితే రానున్న రోజుల్లో లాంచ్ కాబోవు స్మార్ట్ ఫోన్లు దీని కంటే మెరుగైన చిప్సెట్స్ తో లాంచ్ అవ్వనున్నాయి. ఈ తరుణంలో ఒప్పో కంపెనీ Reno 9 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్ ని వాడటం ఆమోదయోగ్యం కాదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous article50MP కెమెరాతో రానున్న Samsung Galaxy A54
Next articleలాంచ్ కి ముందు లీకైన POCO X5 5G స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.