హైలైట్స్:
- త్వరలోనే Reno 8 సిరీస్ సక్సెసర్ Reno 9 సిరీస్ ని లాంచ్ చేయనున్న OPPO
- Snapdragon 778G చిప్ తో రానున్న Reno 9 సిరీస్, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో వస్తుందని ఇది వరకు వచ్చిన ఊహాగానాలు
- UFCS (Universal Fast Charging Specification) స్టాండర్డ్ తో వస్తున్న Reno 9 సిరీస్
Reno 8 సిరీస్ లాంచ్ తర్వాత Reno 9 సిరీస్ పై ఒప్పో కంపెనీ దృష్టి పెట్టింది. ఇదివరకు ఒప్పో Reno 9 సిరీస్ యొక్క చార్జింగ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. తాజాగా ఈ లైనప్ యొక్క చిప్సెట్ ఏంటో తెలిసింది. Weibo ద్వారా ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station షేర్ చేసిన సమాచారాన్ని బట్టి, ఒప్పో Reno 9 సిరీస్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 7 జెన్ 1 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తుందని ఇదివరకు భావించారు. కానీ తాజాగా 778జి చిప్సెట్ సీన్ లోకి వచ్చింది.
Reno 9 సిరీస్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం. ఇది UFCS సపోర్ట్ తో వస్తోంది. UFCS స్టాండర్డ్ ని అడాప్ట్ చేసుకున్న తొలి స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో కావడం విశేషం. అయితే రెనో 8 సిరీస్ లో ఉన్న 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో పోల్చితే Reno 9 సిరీస్ లో అందించిన 40వాట్ చార్జింగ్ చాలా తక్కువ.
Reno 9 సిరీస్ ప్రాసెసర్
తాజాగా బయటకు వచ్చిన లీక్స్ ని బట్టి, Reno 9 సిరీస్ లో కాస్త పాతదైన Snapdragon 778G చిప్సెట్ ని వాడనున్నట్లు తెలుస్తోంది. Snapdragon 7 Gen 1 చిప్ లేదా MediaTek Dimensity 800 సిరీస్ చిప్ ని Reno 9 సిరీస్ లో వినియోగిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం Snapdragon 7 Gen 1 చిప్ కేవలం Reno 8 Pro చైనా వేరియంట్ మరియు Xiaomi Civi 2 ఫోన్ల లోనే ఉంది. అలాగే కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే అమ్ముడయ్యే పలు హ్యాండ్సెట్స్ లో ఈ చిప్సెట్ ఉంది.
న్యూ జనరేషన్ చిప్సెట్స్ తో ఫోన్లు లాంచ్ అవుతోన్న తరుణంలో Reno 9 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్ వాడటం కచ్చితంగా డౌన్‌గ్రేడ్ అనే చెప్పాలి. మరి ఈ వార్త నిజమైతే, లాంచ్ తర్వాత కస్టమర్ల నుంచి ఈ ఫోన్ కి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
ఇక Snapdragon 778G చిప్సెట్ విషయానికి వస్తే, ఇదొక 5జీ ప్రాసెసర్. 2.4 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి, గేమ్స్ ఆడేందుకు ఈ ప్రాసెసర్ బాగానే పని చేస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాసెసర్ మంచి ఫలితాలనే ఇచ్చింది. అయితే రానున్న రోజుల్లో లాంచ్ కాబోవు స్మార్ట్ ఫోన్లు దీని కంటే మెరుగైన చిప్సెట్స్ తో లాంచ్ అవ్వనున్నాయి. ఈ తరుణంలో ఒప్పో కంపెనీ Reno 9 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్ ని వాడటం ఆమోదయోగ్యం కాదు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.