ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఓ లీక్ ద్వారా OPPO A3 Pro యొక్క లైవ్ ఇమేజ్ బయటకు వచ్చింది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. కానీ, ఇండియన్ వేరియంట్ లుక్ వేరుగా ఉంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
OPPO A3 Pro ఇండియన్ మోడల్ డిజైన్ (లీక్)
ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే OPPO A3 Pro యొక్క లైవ్ ఇమేజ్‌ను లీక్ చేశారు. లీకైన ఇమేజ్‌ను క్రింద చూడవచ్చు.
లీక్ ద్వారా ఫోన్ బ్యాక్ ప్యానెల్ మాత్రమే రివీల్ అయ్యింది. ఫోన్ బ్రైట్ పర్పుల్ కలర్ లో కనిపిస్తోంది. ఫినిషింగ్ గ్లాసీగా ఉంది.
బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. రియర్ డిజైన్ గమనిస్తే, కాస్త రెనో 12 సిరీస్ మాదిరి ఉంది.
లైవ్ ఇమేజ్‌ను గమనిస్తే, భారతీయ వేరియంట్ చైనా మోడల్ కంటే విభిన్నంగా ఉండనుందని అర్థమవుతోంది. స్పెసిఫికేషన్స్ కూడా వేరుగా ఉండే అవకాశం ఉంది.
OPPO A3 Pro ఇండియన్ వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. కానీ, టిప్‌స్టర్ ప్రకారం, ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్ లో ఉన్న OPPO A79 5G ని రీప్లేస్ చేస్తుందని సమాచారం. ఓసారి ఒప్పో ఏ79 5జీ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
OPPO A79 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్, 50ఎంపి ఐసోసెల్ జెఎన్1 మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.
త్వరలోనే ఒప్పో ఏ3 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.
