హైలైట్స్
- లాంచ్ అయిన భారతదేశపు అత్యంత చవకైన కారు PMV EaS-E
- కారు ధర రూ.4.70 లక్షలు, బుకింగ్ అమౌంట్ రూ.2,000
- లాంచ్ కి ముందే 6000 బుకింగ్స్ పూర్తి చేసుకున్న PMV EaS-E ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ కారు కొనాలని అందరికీ ఉంటుంది. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో జనాలు ఎలక్ట్రిక్ కారు లేదా బైక్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ కారు ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. దీంతో వారి ఆశ కాస్త అడియాశ గానే మిగిలిపోతోంది. ఈ తరుణంలో ముంబైకి చెందిన PMV ఎలక్ట్రిక్ అనే కంపెనీ సగటు జీవికి సంతోషకరమైన వార్తను తీసుకొచ్చింది. ఈ సంస్థ ఇటీవలె PMV EaS-E అనే చవకైన ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసింది. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కారు ఇదే అనడంలో సందేహం అక్కర్లేదు.
PMV ఎలక్ట్రిక్ కంపెనీ తీసుకొచ్చిన ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారు పేరు PMV EaS-E. ఇది కేవలం చవకైన కారు మాత్రమే కాదండోయ్, అత్యంత చిన్న కారు కూడా. మరి PMV EaS-E ఎలక్ట్రిక్ కారు యొక్క ధర, రేంజ్, ఫీచర్స్, బుకింగ్ వివరాలు ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
PMV EaS-E ఎలక్ట్రిక్ కారు ధర
PMV EaS-E కారు ధరను రూ.4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ధర మొదటి 10 వేల మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు గనుక తొలి 10,000 మంది కస్టమర్లలో ఉంటే ఈ కారుని రూ.5 లక్షల లోపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఈ కారుని లాంచ్ కి ముందే 6000 మంది బుక్ చేసుకున్నారు. కంపెనీ వెబ్‌సైట్ నుంచి కస్టమర్లు ఈ కారుని రూ.2000 బుకింగ్ అమౌంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
భారతదేశంలో PMV EaS-E కారు అత్యంత చవకైనది మరియు అత్యంత చిన్నదైనది కావడం విశేషం. PMV EaS-E కారులో పెద్దలు ఇద్దరు, పిల్లలు ఒకరు కూర్చోవచ్చు. అంటే ఈ కారు మొత్తం ముగ్గురు ప్రయాణించడానికి సరిపోతుంది. కారు సైజ్ గురించి మాట్లాడితే, PMV EaS-E కారు 2,915 మిల్లీ మీటర్ల పొడవు, 1,157 మిల్లీ మీటర్ల వెడల్పు, 1,600 మిల్లీ మీటర్ల ఎత్తు ఉంటుంది. అలాగే ఈ కారు 2,087 మిల్లీ మీటర్ల వీల్ బేస్ కలిగి ఉంది. ఈ చిన్న కారు 170 మిల్లీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ కారు బరువు 550 కిలోలు.
PMV EaS-E రేంజ్ మరియు టాప్ స్పీడ్
PMV EaS-E కారు 48B బ్యాటరీ తో వస్తోంది. ఈ కారు 3 రేంజ్ ఆప్షన్స్ లో లభించనుంది. అవి: 120 కిలోమీటర్లు, 160 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు. ఈ కారు గరిష్ట వేగం 70 kmph. 4 గంటల్లో ఈ ఎలక్ట్రిక్ కారుని పూర్తిగా చార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఏదైనా 15A ఔట్‌లెట్ ద్వారా ఈ కారుని చార్జ్ చేయవచ్చు. కారుతోపాటు 3 కిలోవాట్ ఏసీ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు.
PMV EaS-E కారు అత్యధికంగా 13 బీహెచ్‌పీ పవర్, 50ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 0 నుంచి 40 kmph వేగాన్ని 5 సెకన్లలో చేరుకుంటుందని కంపెనీ చెబుతోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.