POCO M6 5G: చాలా తక్కువ ధరకే పోకో 5జీ స్మార్ట్‌ఫోన్, వివరాలు తెలుసుకోండి

Highlights

  • గతేడాది లాంచైన POCO M6 5G
  • కొత్త వేరియంట్ విడుదల
  • డివైజ్ ధర రూ.8,299

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది భారతీయ మార్కెట్ లో POCO M6 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.10,499 గా ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభించనుంది. దీని ధరను రూ.8,299 గా నిర్ణయించారు.

POCO M6 5G ధర

POCO M6 5G యొక్క కొత్త మోడల్ కి సంబంధించిన వివరాలు Gizmochina వెబ్‌సైట్ ద్వారా బయటకు వచ్చాయి. రిపోర్ట్ ప్రకారం, POCO M6 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.8,249 గా పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. ఈ ఫోన్ సేల్ జులై 20వ తేదీ (రేపటి) నుంచి మొదలవుతుంది.

POCO M6 5G ప్రస్తుతం అందుబాటులో ఉన్న చీపెస్ట్ 5జీ ఫోన్లలో ఒకటిగా చేరింది. టాప్ 2 లిస్ట్ లో Lava Blaze 5G, itel P55 5G ఫోన్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ టీజర్ ని గమనిస్తే అందులో POCO M6 5G ధరను రూ.8,249 గా పేర్కొన్నారు.

POCO M6 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO M6 5G లో 6.74-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (1650*720) రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 8జిబి వరకు వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: POCO M6 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: POCO M6 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

కలర్ ఆప్షన్స్: POCO M6 5G డివైజ్ ఒరైన్ బ్లూ, పొలారిస్ గ్రీన్ మరియు గెలాక్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బరువు, చుట్టుకొలత: POCO M6 5G 168మి.మీ పొడవు, 78 మి.మీ వెడల్పు, 8.19 మి.మీ మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.