హైలైట్స్
- భారత్ లో జనవరి 3 న లాంచ్ కానున్న POCO C50 స్మార్ట్ ఫోన్
- ఇంకా కంపెనీ నుంచి రావాల్సిన అధికార ప్రకటన
- మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ తో రానున్న POCO C50 స్మార్ట్ ఫోన్
POCO C50 స్మార్ట్ ఫోన్ జనవరి 3 న భారత్ లో లాంచ్ అవ్వనున్నట్లు తాజాగా 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందింది. పోకో సీ-సిరీస్ లో ఇది మూడో ఫోన్. ఇదివరకు పోకో సీ31 ఫోన్ సెప్టెంబర్ 2021 లో, పోకో సీ3 ఫోన్ అక్టోబర్ 2020 లో లాంచ్ అయ్యాయి. గ్లోబల్ గా లాంచ్ అయిన POCO C40 కి POCO C50 సక్సెసర్ గా వస్తున్నట్లు భావించవచ్చు.
గ్లోబల్ గా లాంచైన POCO C40 ఫోన్ 6.71-ఇంచ్ డిస్ప్లే, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఇకపోతే POCO C50 ఫోన్ ఎంట్రీ లెవెల్ ని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇంకా ఈ ఫోన్ ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. POCO C31 ఫోన్ అయితే రూ.8,499 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది.
POCO C50 భారత్ లో నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని పోకో సంస్థ ఇదివరకు తెలిపింది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్లన ఈ ఫోన్ లాంచ్ వాయిదా పడింది. త్వరలోనే పోకో ఈ ఫోన్ యొక్క లాంచ్ ని కన్ఫర్మ్ చేస్తుందని మేం అంచనా వేస్తున్నాం.
POCO C50 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ వివరాలు ప్రస్తుతం తెలియదు. ఇదొక బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ కనుక, డివైజ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, ప్లాస్టిక్ బాడీతో వస్తుందని అంచనా వేయవచ్చు. ఇకపోతే హార్డ్‌వేర్ కూడా అదేస్థాయిలో ఉంటుంది. హెచ్డీ+ డిస్ప్లే, ఎంట్రీ-లెవెల్ మీడియాటెక్ లేదా స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది.
ఓసారి POCO C31 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఫోన్ లో 6.53-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఇది మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ తో వచ్చింది. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. భద్రత కోసం ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 4జిబి ర్యామ్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. POCO C50 స్మార్ట్ ఫోన్ పోకో సీ31 కంటే మెరుగైన స్పెసిఫికేషన్స్ తో రానుందని అంచనా వేయవచ్చు. రానున్న రోజుల్లో POCO C50 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.