POCO C51 స్మార్ట్ ఫోన్ భారత్ లో ఏప్రిల్ 7 న లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో మొదటగా POCO C50 డివైజ్ ని 2023 జనవరిలో కంపెనీ లాంచ్ చేసింది. తర్వాత 2023 ఫిబ్రవరిలో POCO C55 డివైజ్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు POCO C51 ఇండియా లాంచ్, లుక్ మరియు డిజైన్, ఎన్నో ముఖ్యమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఏప్రిల్ 7 న ఈ డివైజ్ ధర అనౌన్స్ అవుతుంది.
భారత్ లో POCO C51 ధర
POCO C51 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఏప్రిల్ 7 న ఈ డివైజ్ లాంచ్ కానుంది. అదే రోజున ధర రివీల్ అవుతుంది. POCO C51 లో-బడ్జెట్ ఫోన్ అయినందున దీని ధర సుమారు రూ.8 వేల వద్ద ఉండనుందని అంచనా వేయవచ్చు. రెండు మెమొరీ వేరియంట్స్ లో ఈ పోకో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
POCO C51 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 6.52-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
- మీడియాటెక్ హీలియో జీ36 చిప్
- 7జిబి టర్బో ర్యామ్
- ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్
- 8ఎంపి రియర్ కెమెరా
- 5ఎంపి సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
POCO C51 డివైజ్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఈ ఫోన్ లో 6.52-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
POCO C51 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది 12 నానో మీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ ప్రాసెసర్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో ఈ ఫోన్ 4జిబి ఇంటర్నల్ ర్యామ్ ని 7జిబి వరకు పెంచుకోవచ్చు.
POCO C51 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం POCO C51 లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
POCO C51 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ భద్రత కోసం బ్యాక్ ప్యానెల్ పై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్బీ పోర్ట్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
