ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO తాజాగా భారతీయ మార్కెట్ లో ఒక చవకైన ఫోన్ లాంచ్ చేసింది. దీని ధరను కేవలం రూ.5,999 గా పెట్టారు. ఇది POCO C61 ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్. ఈ ఫోన్‌తో పాటు ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ కూడా వస్తుంది. ఈ లో-బడ్జెట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా?
POCO C61 Airtel ధర, సేల్ వివరాలు
POCO C61 ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్ రూ.5,999 ధరతో భారత్‌లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. జులై 17 నుంచి ఈ కొత్త పోకో ఫోన్‌ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఎథరల్ బ్లూ, డైమండ్ బస్ట్ బ్లాక్ మరియు మిస్టికల్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.
POCO C61 ఎయిర్టెల్ ఎడిషన్ ఫీచర్లు
POCO C61 ఎయిర్టెల్ ఎడిషన్ 18 నెలల వరకు ఎయిర్టెల్ సిమ్ తో లాక్ చేయబడి ఉంటుంది. ఈ సమయం పూర్తయ్యే వరకు మీరు ఎయిర్టెల్ సిమ్‌తోనే కొనసాగాల్సి ఉంటుంది. అంతేకాదు, 50జిబి డేటాను ఎయిర్టెల్ ఉచితంగా అందిస్తోంది. ఎయిర్టెల్ యూజర్లకు 7.5 శాతం లేదా రూ.750 వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది. ఈ బెనిఫిట్ పొందాలంటే మీరు కనీసం రూ.199 లేదా అంతకంటే ఎక్కువ విలువగల ప్లాన్‌ని రీచార్జ్ చేసుకోవాలి.
POCO C61 ఎయిర్టెల్ స్పెసిఫికేషన్స్
స్క్రీన్: POCO C61 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
ప్రాసెసర్: POCO C61 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.
కెమెరా: POCO C61 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: POCO C61 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.
కనెక్టివిటీ: POCO C61 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ ఉన్నాయి.
సెక్యూరిటీ: POCO C61 డివైజ్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు.
