POCO C61 ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • వచ్చే వారం POCO C61 లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • హీలియో జీ36 ప్రాసెసర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO C61 డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా పోకో ఇండియా POCO C61 లాంచ్ తేదీ మరియు ఫ్లిప్‌కార్ట్ లభ్యతను కన్ఫర్మ్ చేసింది. గత మోడల్ POCO C51 కి సక్సెసర్ గా POCO C61 మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి POCO C61 ఇండియా లాంచ్ వివరాలు, ఖరారైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO C61 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

POCO C61 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్ గా ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి రానుంది. ఈ విషయం ఫ్లిప్‌కార్ట్ పై మైక్రోసైట్ ద్వారా ఖరారైంది. బ్లాక్ కలర్ ఆప్షన్ ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిస్తోంది. మైక్రో-సైట్ ద్వారా కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO C61 రేడియంట్ రింగ్ డిజైన్ కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని POCO C61 లో అందిస్తున్నారు.

POCO C61 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఈ డివైజ్ 6జిబి ఫిజికల్ ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. అంటే ఈ డివైజ్ గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ ని ఆఫర్ చేస్తుంది.

POCO C61 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గూగుల్ ప్లే కన్సోల్, బ్లూటూత్ ఎస్ఐజీ మరియు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

Google Play Console డేటాబేస్ లిస్టింగ్ ద్వారా MediaTek Helio G36 ప్రాసెసర్, 4జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. గత నెలలో భారత్ లో లాంచైన Redmi A3 కి రీబ్రాండ్ వర్షన్ గా POCO C61 మార్కెట్ లోకి వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Redmi A3 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi A3 లో 6.71-ఇంచ్ హెచ్డీ+ (1650*720 పిక్సెల్స్) డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi A3 లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ వాడారు.
  • కెమెరా: Redmi A3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • ఓఎస్: Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Redmi A3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi A3 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi A3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Previous articleRealme: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme 12x 5G
Next articleVivo T3 5G స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న టాప్-5 ఫీచర్లు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.