Xiaomi సబ్-బ్రాండ్ Poco నుంచి త్వరలో POCO C65 స్మార్ట్ఫోన్ రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ నవంబర్ 5 వ తేదీన లాంచ్ అవుతోంది. ఎంట్రీ-లెవెల్ స్పెసిఫికేషన్స్ తో కూడిన ఈ ఫోన్ సరసమైన ధరలోనే లభించనుంది. తాజాగా లాంచ్ తేదీని ప్రకటించిన పోకో సంస్థ, డివైజ్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ను కూడా వెల్లడించింది. సరే, ఓసారి POCO C65 డివైజ్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
POCO C65 లాంచ్ తేదీ
?Entry-level entertainment powerhouse is back, with enhanced features at no extra cost?
Say hello to our latest creation in the C series #POCOC65! ?
Stay tuned for the online launch of #POCOC65 on Nov 5th. pic.twitter.com/M6FW8bete3— POCO (@POCOGlobal) November 2, 2023
- POCO C65 టీజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై పోస్ట్ అయ్యింది.
- టీజర్ పోస్ట్ లో డివైజ్ నవంబర్ 5 న లాంచ్ కానుందని పేర్కొనబడింది. అలాగే మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర కూడా వెల్లడయ్యాయి.
- POCO C65 డివైజ్ ఒక ఎంట్రీ లెవెల్ ఎంటర్టెయిన్మెంట్ పవర్ హౌజ్ అని పోస్ట్ లో కంపెనీ తెలిపింది.
POCO C65 ధర
- POCO C65 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.
- 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 109 డాలర్లు (సుమారు రూ.9,000) నిర్ణయించారు.
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 129 డాలర్లు (సుమారు రూ.11,000) గా ఉంటుంది.
- ఈ ధరలు ఎర్లీ బర్డ్ ఆఫర్ పరిధిలోకి వస్తాయని చెప్పవచ్చు. తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది.
- మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 50ఎంపి ఏఐ ట్రిపుల్ కెమెరాతో ఫోన్ వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
POCO C65 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: POCO C65 లో 6.59-ఇంచ్ ఫుల్హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
- మెమొరీ: POCO C65 డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: POCO C65 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
