షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో భారతీయ మార్కెట్ లో POCO C65 ని లాంచ్ చేయనుంది. 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోంది. అయితే కంపెనీ ఇంకా అధికార ప్రకటన చేయక ముందే, 91మొబైల్స్ కి POCO C65 యొక్క ఫోటోలు అందాయి. దీంతో POCO C65 యొక్క డిజైన్, అలాగే పర్పుల్ కలర్ ఆప్షన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
లీకైన POCO C65 ఇమేజెస్
- 91మొబైల్స్ కి POCO C65 యొక్క మార్కెటింగ్ మెటీరియల్ లభించింది.
- ఫోటో లో గమనిస్తే, POCO C65 డివైజ్ పర్పుల్ కలర్ లో కనిపిస్తోంది.
- ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, రెండు కెమెరా రింగ్స్ కనిపిస్తున్నాయి.
- కెమెరా సెటప్ వద్ద ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉంది. ఇంకా 50ఎంపి లెన్స్ గురించి రాసి ఉంది.
- డివైజ్ రియర్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది. ఎడ్జెస్ రౌండ్ గా కనిపిస్తున్నాయి.
POCO C65 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: POCO C65 లో 6.74-ఇంచ్, వాటర్ డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ ఉంటాయి.
- ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
- ఓఎస్: POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- మెమొరీ: POCO C65 రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
- కెమెరా: POCO C65 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
