
షావోమి సబ్-బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO C65 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే ఈ విషయం తెలుస్తోంది. ఇకపోతే, POCO C65 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి. సరే, ఓసారి POCO C65 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
POCO C65 ధర, సేల్ తేదీ
- POCO C65 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499 గా ఉంది.
- POCO C65 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,499 గా ఉంది.
- POCO C65 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు.
- POCO C65 డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిసెంబర్ 18 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.
- ఐసీఐసీఐ కార్డ్ యూజర్లు ఫోన్ కొనుగోలుపై రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
POCO C65 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: POCO C65 లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: POCO C65 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: POCO C65 లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
- ఓఎస్: POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: POCO C65 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: POCO C65 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- కనెక్టివిటీ: POCO C65 లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- సెక్యూరిటీ: POCO C65 లో భ్రదత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.











