
POCO బ్రాండ్ త్వరలో లో-బడ్జెట్ సెగ్మెంట్ C-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీ-సిరీస్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్ వెబ్సైట్లో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ మరియు ఫోన్ పేరు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుందని అర్థమవుతోంది.
కొన్ని వారాల క్రితం, POCO C65 డివైజ్ FCC మరియు IMEI సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది. POCO C55కి సక్సెసర్‌గా వస్తోన్న POCO C65 డివైజ్ కి సంబంధించిన సర్టిఫికేషన్ వివరాలు ఇక్కడ అందజేశాం. ఓసారి చదివి తెలుసుకోండి.
త్వరలో POCO C65 లాంచ్ అయ్యే అవకాశం
- రాబోయే ఎంట్రీ-లెవల్ POCO హ్యాండ్సెట్ TDRA వెబ్సైట్లో “2310FPCA4G” మోడల్ నంబర్‌తో జాబితా చేయబడింది.
- ఇదే వెబ్ సైట్ లో డివైజ్ పేరు “POCO C65”గా నిర్ధారించబడింది. మోడల్ నంబర్ చివరిలో ఉన్న G అనేది డివైజ్ యొక్క గ్లోబల్ వేరియంట్ అని సూచిస్తుంది.
- అంటే ఈ చవకైన ఫోన్ భారతదేశం మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- వెబ్ సైట్ లో ఫోన్ తయారీదారు పేరు “Xiaomi కమ్యూనికేషన్స్ కో.లిమిటెడ్”గా జాబితా చేయబడింది.
- ఇంకా, ఈ వెబ్ సైట్ ద్వారా డివైజ్ యొక్క ఏ స్పెసిఫికేషన్స్ కూడా బయటకు రాలేదు.
- అయితే, ఈ జాబితా మరియు కొన్ని మునుపటి లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ 4G డివైజ్ అని తెలుస్తోంది. అంతేకాకుండా, భారతీయ వేరియంట్ “2310FPCA4I” మోడల్ నంబర్‌ను కలిగి ఉంది.
- ఇదివరకు వచ్చిన వార్తల ప్రకారం, POCO C65 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుందని అర్థమవుతోంది.
- అలాగే ఈ డివైజ్ 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్సీ లకు సపోర్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
- ఇంకా, POCO C65 ఫోన్ Redmi 13C కి రీబ్రాండ్ గా వస్తోందని ఒక రూమర్ వచ్చింది. ఇది ఇంకా ప్రకటించబడలేదు.
- POCO C65 డిజైన్ కొన్ని స్వల్ప మార్పులతో Redmi 13C మాదిరిగానే ఉంటుందని మేం ఆశిస్తున్నాం.
- ఈ రెండు డివైజెస్ కూడా 50MP ప్రైమరీ స్నాపర్‌తో వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.












