Home News TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన POCO C65; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన POCO C65; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న POCO C65
  • రీసెంట్ గా FCC సైట్ లో లిస్ట్టైన డివైజ్
  • Redmi 13C కి రీబ్రాండ్‌గా వస్తోన్న POCO C65?

POCO బ్రాండ్ త్వరలో లో-బడ్జెట్ సెగ్మెంట్ C-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీ-సిరీస్ ఫోన్ వివిధ సర్టిఫికేషన్ సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ మరియు ఫోన్ పేరు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుందని అర్థమవుతోంది.

కొన్ని వారాల క్రితం, POCO C65 డివైజ్ FCC మరియు IMEI సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపించింది. తాజాగా ఈ డివైజ్ TDRA సర్టిఫికేషన్‌ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది.  POCO C55కి సక్సెసర్‌గా వస్తోన్న POCO C65 డివైజ్ కి సంబంధించిన సర్టిఫికేషన్ వివరాలు ఇక్కడ అందజేశాం. ఓసారి చదివి తెలుసుకోండి.

త్వరలో POCO C65 లాంచ్ అయ్యే అవకాశం