Home News ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన POCO F5 Pro; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన POCO F5 Pro; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • థాయిలాండ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన POCO F5 Pro
  • త్వరలోనే లాంచ్ కానున్న POCO F5 Pro డివైజ్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న ఫోన్

POCO F5 సిరీస్ గురించి నెట్టింట్లో రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. POCO F5 తో పాటు POCO F5 Pro కూడా గ్లోబ్ లగా త్వరలోనే లాంచ్ కానుందని సమాచారం. POCO F5 Pro గురించి మాట్లాడితే ఈ డివైజ్ తాజాగా NBTC సర్టిఫికేషన్ ప్రాసెస్ ని పూర్తి చేసినట్లు నేడు సమాచారం బయటకు వచ్చింది. దీన్ని బట్టి ఈ డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని స్పష్టమవుతోంది.

NBTC సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న POCO F5 Pro

పైన ట్వీట్ లో కనిపిస్తోన్న విధంగా, POCO F5 Pro డివైజ్ POCO23013PC75G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ప్రక్రియను ఈ డివైజ్ పూర్తి చేసింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని స్పష్టమైంది. ఇది గ్లోబల్ వేరియంట్ అని చెప్పడానికి కారణం, మోడల్ నంబర్ లో G అనే అక్షరం ఉండటమే. ఇండియన్ వేరియంట్ కి చెందిన సమాచారం తెలుసుకునేందుకు వివిధ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ జల్లెడ పట్టాం. కానీ, ఎటువంటి సమాచారం దొరకలేదు.

అంటే POCO F5 Pro డివైజ్ భారత్ లో లాంచ్ కాకపోవచ్చు. లేదంటే ఈ ఏడాది మరొక సమయంలో లాంచ్ అవ్వవచ్చు. అయితే ఈ ఏడాది ఏదో ఒక సమయంలో లాంచ్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ పేరుతో పాటు, డివైజ్ 5జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలిసింది. అలాగే ఈ లిస్టింగ్ ద్వారా POCO F5 Pro డివైజ్ ని Redmi K60 తో పోల్చి చూసేందుకు అవకాశం దొరికినట్లైంది.

POCO F5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే మరియు కెమెరా

POCO F5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది.

చిప్సెట్, బ్యాటరీ, స్టోరేజీ

POCO F5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే చాన్స్ ఉంది. ఇంకా 30 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని సమాచారం. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో రానుంది.

ఓఎస్

POCO F5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేసేందుకు అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.