Home News POCO F6 గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

POCO F6 గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

Highlights
  • త్వరలో POCO F6 లాంచ్
  • మోడల్ నంబర్ 24069PC21G
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్‌ని బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై 91mobiles గుర్తించింది. ఓసారి POCO F6 యొక్క గీక్‌బెంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

POCO F6 గీక్‌బెంచ్ డేటాబేస్ వివరాలు

POCO F6 స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై 24069PC21G అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది.

POCO F6 డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1884 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4799 పాయింట్లు స్కోర్ చేసింది.

POCO F6 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14, హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లిస్ట్ అయ్యింది.

POCO F6 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.01GHz. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ ఈ ఫోన్ లో ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

POCO F6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: POCO F6 లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయి.

కెమెరా: POCO F6 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ: POCO F6 లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీ ఉంటాయి.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: POCO F6 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.