ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. POCO F6 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, టీడీఆర్ఏ మరియు ఎన్బీటీసీ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. రెడ్మీ కే70 కి రీబ్రాండ్ వర్షన్‌గా POCO F6 Pro డివైజ్ రానుందన్న విషయం షావోమి పొరబాటున లీక్ చేసిన వివరాల ద్వారా తెలిసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
POCO F6 Pro అప్డేట్ లాగ్ డీటెయిల్స్
షావోమి యాక్సిడెంటల్‌గా POCO F6 Pro అప్డేట్ లాగ్‌ని మార్చి 2024 సెక్యూరిటీ ప్యాచ్ తో కలిపి పోస్ట్ చేసింది. ఈ లాగ్ ద్వారా డివైజ్ పేరు మరియు కోడ్ నేమ్ (vermeer) రివీల్ అయ్యాయి. GSMArena వెబ్‌సైట్ తొలుత ఈ విషయాన్ని గుర్తించింది.
vermeer అనే కోడ్ నేమ్ ఇదివరకు Redmi K70 కూడా ఉంది. దీంతో POCO F6 Pro డివైజ్ రెడ్మీ కే70 కి రీబ్రాండ్ వర్షన్ గా గ్లోబల్ మార్కెట్స్ లోకి రాబోతున్నట్లు అర్థమవుతోంది.
2023 నవంబర్ నుంచి Redmi K70 చైనా మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. మరి రెడ్మీ కే70 తో POCO F6 Pro కి ఏ మేరకు పోలికలు ఉంటాయో చూడాలి.
Redmi K70 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Redmi K70 లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ విజన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
ప్రాసెసర్: Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు.
మెమొరీ: Redmi K70 డివైజ్ 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది.
సాఫ్ట్‌వేర్: Redmi K70 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Redmi K70 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Redmi K70 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
