Home News Poco: లాంచ్‌కి ముందు లీకైన Poco F6 స్పెసిఫికేషన్స్

Poco: లాంచ్‌కి ముందు లీకైన Poco F6 స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో Poco F6 లాంచ్
  • 6.67-ఇంచ్ 1.5కే డిస్ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Poco త్వరలో ఎఫ్6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Poco F6 మరియు Poco F6 Pro స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ సిరీస్ ఏప్రిల్ లేదా మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రో మోడల్ కి సంబంధించిన వివరాలు ఇంకా రివీల్ కాలేదు. కానీ, Poco F6 స్పెసిఫికేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Poco F6 స్పెసిఫికేషన్స్

Poco F6 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ని Android Headlines తన కథనం ద్వారా షేర్ చేసింది. ఓసారి అవెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Turbo కి రీబ్రాండ్ వర్షన్ గా Poco F6 మార్కెట్ లోకి రానుందని సమాచారం. త్వరలో రెడ్మీ నోట్ 13 టర్బో చైనాలో లాంచ్ కానుంది. తర్వాత Poco F6 పేరుతో భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో Poco F6 లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.