ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO త్వరలో ఎమ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. POCO M6 4G పేరుతో ఈ ఫోన్ భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా పోకో వెబ్‌సైట్ లో POCO M6 4G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ లిస్ట్ అయ్యాయి. ఈ ఫోన్ 108ఎంపి మెయిన్ కెమెరా, 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానుంది. ఓసారి రివీలైన పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
POCO M6 4G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: POCO M6 4G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 20.5:9 యాస్పెక్ట్ రేషియో, 550 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
ప్రాసెసర్: POCO M6 4G లో మీడియాటెక్ హీలియో జీ91 అల్ట్రా చిప్సెట్ ఉంటుంది.
కెమెరా: POCO M6 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: POCO M6 4G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
బ్యాటరీ: POCO M6 4G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
ఓఎస్: POCO M6 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇతర ఫీచర్లు: POCO M6 4G లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ-సీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.
POCO M6 4G ధర, కలర్ ఆప్షన్స్
POCO M6 4G డివైజ్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 129 డాలర్లు (రూ.10,700) గా నిర్ణయించారు.
POCO M6 4G యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 149 డాలర్లు (సుమారు రూ.12,400) గా ఉంది.
POCO M6 4G స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సిల్వర్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
