షావోమి సబ్-బ్రాండ్ POCO నేడు భారతీయ మార్కెట్ లో POCO M6 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ పవర్ఫుల్ ఫీచర్లతో వచ్చింది. లో-బడ్జెట్ 5జీ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ డివైజ్ ని తీసుకొచ్చారు. POCO M6 5G లో టర్బో ర్యామ్ సపోర్ట్ తో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి POCO M6 5G కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
POCO M6 5G ధర, లభ్యత
- POCO M6 5G స్మార్ట్ ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- POCO M6 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు.
- POCO M6 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.11,499 గా ఉంది.
- POCO M6 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది.
- POCO సంస్థ అన్ని మోడల్స్ పై బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. దీని ద్వారా బేస్ మోడల్ ని కస్టమర్లు రూ.9,499 కే సొంతం చేసుకోవచ్చు.
- POCO M6 5G డివైజ్ సేల్ డిసెంబర్ 26 నుంచి ఫ్లిప్కార్ట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా మొదలవుతుంది.
- POCO M6 5G డివైజ్ ఒరైన్ బ్లూ మరియు గెలాక్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
POCO M6 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: POCO M6 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
- ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. మంచి గేమింగ్ పెర్ఫామెన్స్ కోసం ఈ చిప్సెట్ బాగా ఉపయోగపడుతుంది.
- ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
- కెమెరా: POCO M6 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి.
- ఇతర ఫీచర్లు: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.
