POCO M6 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి

Highlights

  • POCO M6 5G డిస్కౌంట్
  • అమెజాన్ పై ఆఫర్
  • రూ.1,501 డిస్కౌంట్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO గతేడాది భారతీయ మార్కెట్ లో POCO M6 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ డిస్కౌంట్ రేటుకి అమెజాన్ లో అమ్ముడవుతోంది. డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఓసారి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

POCO M6 5G ఆఫర్ వివరాలు

POCO M6 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ పై రూ.1,501 డిస్కౌంట్ లభిస్తుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఆఫర్ తర్వాత 4జిబి వేరియంట్ రూ.8,998 కి లభించనుంది. 6జిబి ర్యామ్ మోడల్ ధర రూ.9,998 కే లభిస్తుంది.

లాంచ్ సమయంలో POCO M6 5G 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. 6జిబి ర్యామ్ మోడల్ ధర రూ.11,499 గా ఉంది.

డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ కూడా అమెజాన్ పై అందుబాటులో ఉంది. అలాగే, రూ.8,500 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా ఉంది.

అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ఒరైన్ బ్లూ మరియు గెలాక్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO M6 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: POCO M6 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G 4జిబి/6జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: POCO M6 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఏఐ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఆండ్రాయిడ్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.