డిసెంబర్ 22న భారత్‌లో లాంచ్ కానున్న POCO M6 5G

Highlights

  • POCO M6 5G ఇండియా లాంచ్ తేదీ ప్రకటన
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా POCO M6 5G సేల్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తోన్న POCO M6 5G

షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో POCO M6 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 22 వ తేదీన POCO M6 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో అడుగు పెట్టనుంది. సెప్టెంబర్ నెలలో పోకో సంస్థ POCO M6 Pro 5G ని లాంచ్ చేసింది. ఇప్పుడు POCO M6 5G ని యూజర్ల కోసం తీసుకొస్తోంది. సరే, ఓసారి POCO M6 5G లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO M6 5G లాంచ్ తేదీ, డిజైన్

  • POCO M6 5G డివైజ్ డిసెంబర్ 22 వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది.
  • ‘ది రియల్ 5జీ డిస్రప్టర్’ అనే క్యాప్షన్ ని పోకో టీజ్ చేసింది. దీంతో ఇది సరసమైన ధరలో వస్తుందని అర్థమవుతోంది.
  • POCO M6 5G లాంచ్ ఈవెంట్ పోకో సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చూడవచ్చు.
  • POCO M6 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తుందని పోకో కన్ఫర్మ్ చేసింది.
  • పర్పుల్ షేడ్ కలర్ ఆప్షన్ లో POCO M6 5G రానుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్‌కి ఎడమవైపు ఫ్రేమ్ పై సిమ్ కార్డ్ ట్రే ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ కుడివైపున ఉన్నాయి.
  • POCO M6 5G లో డ్యూయల్ కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. డివైజ్ లో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉండే అవకాశం ఉంది.
  • POCO M6 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉండవచ్చు. ఇప్పుడు అంచనా స్పెసిఫికేషన్స్ చూద్దాం.

POCO M6 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రముఖ టిప్‌స్టర్ క్యాస్పర్ ప్రకారం, POCO M6 5G డివైజ్ Redmi 13C 5G కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి, స్పెసిఫికేషన్స్ కూడా అదే మాదిరి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

  • డిస్ప్లే: POCO M6 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్, లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ 2 జీపీయూ ఉంటుంది.
  • కెమెరా: POCO M6 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ ఏఐ కెమెరా అందించనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో రానుంది.
  • కనెక్టివిటీ: POCO M6 5G లో 7 5జీ బ్యాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
Previous articleMoto Razr 40 Ultra, Razr 40 పై రూ.10,000 తగ్గింపు; వివరాలు తెలుసుకోండి!
Next articleలాంచ్‌కి ముందు లీకైన Honor Magic 6 స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.