Dimensity 6100+ చిప్‌తో వస్తోన్న POCO M6 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO M6 5G
  • Redmi 13C 5G కి రీబ్రాండ్‌గా వస్తోన్న POCO M6 5G
  • POCO M6 5G మోడల్ నంబర్ 23128PC33I

షావోమి సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO M6 5G డివైజ్ లాంచ్ కానుంది. ఇప్పటికే భారతీయ మార్కెట్ లో లాంచైన Redmi 13C 5G కి POCO M6 5G రీబ్రాండ్ వర్షన్ గా వస్తుందని సమాచారం. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ క్యాస్పర్ స్క్రిజిపెక్ X పై POCO M6 5G యొక్క వివరాలను షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా POCO M6 5G డివైజ్ రెడ్మీ 13సీ 5జీ కి రీబ్రాండ్ అని తెలుస్తోంది. సరే, ఓసారి POCO M6 5G కి సంబంధించి రివీలైన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO M6 5G లీకైన వివరాలు

  • క్యాస్పర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ని గమనిస్తే, అందులో ఎంఐయూఐ కోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే POCO M6 5G కోడ్ నేమ్ air_p అని ఉంది.
  • ఇక స్క్రీన్ షాట్ లో POCO M6 5G మోడల్ నంబర్ 23128PC33I గా ఉంది. ఇందులో ఐ అంటే ఇండియన్ వేరియంట్ అని అర్థం.
  • POCO సంస్థ M5 సిరీస్ లో కేవలం ఒకే ఒక ఫోన్ POCO M5 ని మాత్రమే లాంచ్ చేసింది. ఇది 5జీ డివైజ్ కాదు. కాబట్టి, త్వరలో రాబోవు POCO M6 5G డివైజ్ 2022 ఏప్రిల్ లో లాంచైన POCO M4 5G కి సక్సెసర్ గా వస్తోంది.
  • POCO M6 5G తో పాటు కంపెనీ POCO M6 Pro (4G) ని కూడా లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ 4జీ మోడల్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. 64ఎంపి ప్రైమరీ కెమెరాతో POCO M6 Pro 4G లాంచ్ కానుంది.
  • అయితే కంపెనీ నుంచి ఈ రెండు డివైజెస్ కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్, లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ 2 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: Redmi 13C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ ఏఐ కెమెరా అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi 13C 5G లో 7 5జీ బ్యాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
Previous articleMediaTek Dimensity 6020 చిప్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36i
Next article3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Honor Magic 6 Pro
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.