ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. POCO M6 Plus 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి POCO M6 Plus 5G యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.
POCO M6 Plus 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
POCO M6 Plus 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై 24065PC95I అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ డివైజ్ బ్రీజ్ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. మోడల్ నంబర్ లోని మొదటి అంకెలు 2406 ను గమనిస్తే, ఈ నెలలోనే ఫోన్ లాంచ్ అవ్వనుందని అర్థమవుతోంది.
POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ లిస్టింగ్ పై 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 440పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.
POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ SM4450 ప్రాసెసర్, అడ్రెనో 613 జీపీయూ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అంటే స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుందని చెప్పవచ్చు.
చైనా మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi Note 13R కి రీబ్రాండ్ వర్షన్ గా POCO M6 Plus 5G భారత్ లో ప్రవేశించనుందని సమాచారం. రెడ్మీ నోట్ 13ఆర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్, అడ్రెనో 613 జీపీయూ, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది.
Redmi Note 13R స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Redmi Note 13R 5G లో 6.79-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2460*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Redmi Note 13R 5G డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3GHz.
మెమొరీ: Redmi Note 13R 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా: Redmi Note 13R 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Redmi Note 13R 5G లో పవర్ బ్యాకప్ కోసం 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Redmi Note 13R 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.
