Home News లాంచ్‌కి ముందు రివీలైన POCO M6 Pro 5G డిజైన్

లాంచ్‌కి ముందు రివీలైన POCO M6 Pro 5G డిజైన్

Highlights
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న POCO M6 Pro 5G
  • డిజైన్: ఫ్లాట్ స్క్రీన్, డ్యూయల్-టోన్ రియర్ ప్యానెల్
  • Note 12R 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తోన్న POCO M6 Pro 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలోనే భారత్ లో ఎమ్-సిరీస్ లో ఒక స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. POCO M6 Pro 5G అనే పేరుతో వస్తోన్న ఈ ఫోన్ చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi Note 12R 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా POCO M6 Pro 5G డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. POCO M6 Pro 5G డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ తో వస్తోంది.

రివీలైన POCO M6 Pro 5G డిజైన్

POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా. పోకో సంస్థ ఇంకా ఈ డివైజ్ లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈలోపు కంపెనీ ఈ ఫోన్ యొక్క రియర్ ప్యానెల్ డిజైన్ ని రివీల్ చేసింది. POCO M6 Pro 5G డివైజ్ డ్యూయల్-టోన్ బ్యాక్ తో వస్తోంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ యొక్క పై భాగం రెక్టాంగ్యులర్ షేప్ లో బ్లాక్డ్ ఔట్ గా కనిపిస్తోంది. ఈ ఏరియా లోనే డ్యూయల్-కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. టాప్ రైట్ కార్నర్ లో పోకో లోగో ఉంది. ఈ డివైజ్ సైయన్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. సిమ్ ట్రే ఫోన్‌కి ఎడమ వైపు ఎడ్జ్ పై ఉంది.

POCO M6 Pro 5G స్పెసిఫికేషన్స్