Home News POCO M6 Pro 5G: 50mp కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన పోకో ఎమ్6 ప్రో 5జీ!

POCO M6 Pro 5G: 50mp కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంచైన పోకో ఎమ్6 ప్రో 5జీ!

Highlights
  • ప్రీమియమ్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వచ్చిన డివైజ్
  • 12జిబి టర్బో ర్యామ్ ని ఆఫర్ చేయనున్న ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ తో వచ్చిన హ్యాండ్సెట్

షావోమి సబ్-బ్రాండ్ పోకో POCO M6 Pro 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గ్రేట్ డిజైన్, స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ సేల్ మొదలుకానుంది. బడ్జెట్ రేంజ్ లో 5జీ ఫోన్ ని కొనాలని భావిస్తున్న వారికి POCO M6 Pro 5G మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సరే, ఓసారి POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం.

POCO M6 Pro 5G ధర, లభ్యత

POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.11,999 గా ఉంది. ఆగస్టు 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

POCO M6 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 6.79-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ డిజైన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటాయి.

చిప్సెట్: POCO M6 Pro 5G లో స్మార్ట్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.

బ్యాటరీ: POCO M6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ: POCO M6 Pro 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.

ఓఎస్: POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.