Home News త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G; టీజ్ చేసిన కంపెనీ!

త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 5G; టీజ్ చేసిన కంపెనీ!

Highlights
  • కొత్త స్మార్ట్ ఫోన్ ని టీజ్ చేసిన పోకో సంస్థ
  • ఈ హ్యాండ్సెట్ POCO M6 Pro 5G అని అంచనా
  • Redmi Note 12R కి రీబ్రాండ్ గా వస్తోన్న POCO M6 Pro 5G?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO భారతీయ మార్కెట్ లో POCO C50, POCO C51, POCO C55, POCO X5, POCO X5 Pro, POCO F5 అనే ఫోన్లను ఈ ఏడాది లాంచ్ చేసింది. పోకో ఇండియా హెడ్, హిమాన్శు టాండన్ తాజాగా 5-నంబర్డ్ సిరీస్ ఫోన్ల లాంచ్ ముగిసిందని తెలిపారు. అలాగే ఆయన తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా 6-నంబర్డ్ ఫోన్ గురించి హింట్ ఇచ్చారు.

Redmi Note 12R కి రీబ్రాండ్ వర్షన్ గా POCO M6 Pro 5G భారత్ లోకి రానుందని రీసెంట్ గా టిప్‌స్టర్ Kacper Skrzypek వెల్లడించారు. POCO M6 Pro 5G హ్యాండ్సెట్ ఐఎంఈఐ డేటాబేస్ పై 23076PC4B1 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. మరోవైపు టిప్‌స్టర్ హిమాన్శు టాండన్ ఫోన్ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. డివైజ్ Redmi Note 12R కి రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే కంపెనీ నుంచి అధికార ప్రకటన వస్తే గాని ఏమీ తెలియదు. కానీ, రానున్న రోజుల్లో రివీల్ అయ్యే స్పెసిఫికేషన్స్ తో ఈ విషయం పై క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు. సరే ఇప్పుడు ఓసారి Redmi Note 12R స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

Redmi Note 12R స్పెసిఫికేషన్స్