POCO X5 Pro తో పాటు పోకో కంపెనీ POCO X5 5G ని కూడా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న POCO X5 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వచ్చింది. ఈ హ్యాండ్సెట్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. Redmi Note 12 5G కి ఈ ఫోన్ కి చాలా పోలికలు ఉన్నాయి.
POCO X5 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. POCO X5 5G డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. ఓసారి POCO X5 5G ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు లభ్యత గురించి తెలుసుకుందాం పదండి.
POCO X5 5G ధర, లభ్యత
POCO X5 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 249 డాలర్లు (సుమారు రూ.20,500) గా ఉంది. ఇక 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 299 డాలర్లు (సుమారు రూ.24,700) గా ఉంది.
లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ డివైజ్ పై 50 డాలర్ల డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర 199 డాలర్లకు తగ్గనుంది. ఈ హ్యాండ్సెట్ నేటి (ఫిబ్రవరి 7) నుంచి వివిధ దేశాల్లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
POCO X5 5G స్పెసిఫికేషన్స్
POCO X5 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 45,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. సెల్ఫీ షూటర్ కోసం సెంటర్ పంచ్ హోల్ నాచ్ ఇచ్చారు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ని డిస్ప్లే కి అందించారు.
POCO X5 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీట్ ప్రాసెస్ పై తయారైన చిప్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు. ఈ హ్యాండ్సెట్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చింది. POCO X5 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
POCO X5 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
పవర్ బ్యాకప్ కోసం POCO X5 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ ఇచ్చారు. హైబ్రిడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఐపీ53 రేటింగ్, ఐఆర్ బ్లాస్టర్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
POCO X5 5G స్మార్ట్ ఫోన్ బ్లాక్, గ్రీన్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 165.88 మిల్లీ మీటర్ల పొడవు, 76.21 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.98 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
