Home News లాంచ్ కి ముందు లీకైన POCO X5 5G స్పెసిఫికేషన్స్

లాంచ్ కి ముందు లీకైన POCO X5 5G స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

POCO కంపెనీ నుంచి ఈ ఏడాది మొదట్లో POCO X4 Pro 5G అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. త్వరలోనే పోకో X5 సిరీస్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ సిరీస్ లో పోకో కనీసం రెండు స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేయనుందని సమాచారం. అవి: POCO X5, X5 Pro 5G. లాంచ్ టైమ్ లైన్ కి సంబంధించి కంపెనీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. ఈలోపు స్టాండర్డ్ వేరియంట్ అయిన POCO X5 5G, IMEI డేటాబేస్ పై కనిపించింది.

ఐఎంఈఐ లిస్టింగ్ ద్వారా POCO X5 5G డివైజ్ యొక్క మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. దీనికి తోడు XiaomiUI రిపోర్ట్ POCO X5 5G యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ని రివీల్ చేసింది.

POCO X5 5G IMEI లిస్టింగ్

పోకో బ్రాండ్ నుంచి వస్తోన్న మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ POCO X5 5G. త్వరలోనే ఈ కంపెనీ భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో ఈ డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఐఎంఈఐ లిస్టింగ్ పై POCO X5 5G ఫోన్ 22101320G, 22101320I అనే మోడల్ నంబర్లతో కనిపించింది. ఈ నంబర్స్ లో G అంటే గ్లోబల్ వేరియంట్ అని అర్థం. ఇక I అంటే ఇండియన్ వేరియంట్. చైనీస్ వేరియంట్ రెడ్మీ ఫోన్ గా లాంచ్ అవుతుంది. ఇది 22101320C అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.

XiaomiUI వెబ్ సైట్ కథనాన్ని బట్టి, POCO X5 5G ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే తో రానుందని సమాచారం. ఇంకా ఈ ఫోన్లో అమోలెడ్ కి బదులుగా ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ని వాడినట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్సెట్ ని కలిగి ఉండనుంది. ఇదే చిప్సెట్ ని మనం Nothing Phone (1), Moto Edge 30 5G స్మార్ట్ ఫోన్స్ లో చూశాం.

ఇక POCO X5 5G డివైజ్ రెడ్‌వుడ్ అనే కోడ్ నేమ్ తో కనిపించింది. ఇకపోతే ఈ ఫోన్ ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. XiaomiUI ప్రకారం, POCO X5 5G అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 20 మధ్య లాంచ్ కానుంది. కాబట్టి మేం మా పాఠకులకు ఇస్తున్న సలహా ఏంటంటే, లాంచ్ డేట్ ని కచ్చితమని అనుకోవద్దు. లాంచ్ తేదీలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.