భారత్ లో నేడు POCO X5 Pro స్మార్ట్ ఫోన్ లాంచైంది. గతేడాది వచ్చిన POCO X4 Pro కి ఇది సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Redmi Note 12 Speed Edition కి రీబ్రాండ్ గా POCO X5 Pro వచ్చినట్లు తెలుస్తోంది. భారీ కెమెరా మాడ్యూల్, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సర్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ తో ఈ ఫోన్ వచ్చింది.
POCO X5 Pro స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఉన్నాయి. సరే, ఓసారి POCO X5 Pro పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ తేదీ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
POCO X5 Pro స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.22,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ Flipkart ద్వారా సేల్ కి అందుబాటులో ఉంటుంది. పోకో యెల్లో, ఆస్ట్రాల్ బ్లాక్, హారిజన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎర్లీ యాక్సెస్ సేల్ ఫిబ్రవరి 6 వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి మొదలైంది.
POCO X5 Pro స్పెసిఫికేషన్స్
- 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్
- ఆండ్రాయిడ్ 12 ఓఎస్
- 108ఎంపి ప్రైమరీ + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
- 5000mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్
POCO X5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎక్స్‌ఇన్ఫినిటీ అమోలెడ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
POCO X5 Pro హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ అందించారు. ఈ ఫోన్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.
POCO X5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ ని కంపెనీ హామినిస్తోంది. POCO X5 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
POCO X5 Pro లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెస్ ఆడియో, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్ 162.91 మిల్లీ మీటర్ల పొడవు, 76.03 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.9 మిల్లీ మీటర్ల మందం, 181 గ్రాముల బరువు ఉంటుంది.
POCO X5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం2 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. 12-లేయర్ గ్రాఫైట్ షీట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
