Xiaomi సబ్-బ్రాండ్ POCO జనవరిలో X6 సిరీస్ ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ లో POCO X6 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. తాజాగా, పోకో కంపెనీ POCO X6 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ పై ఈ ఫోన్ సేల్ మొదలైంది. బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
POCO X6 5G ధర, లభ్యత మరియు ఆఫర్లు
- POCO X6 5G స్మార్ట్ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది.
- POCO X6 5G కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.
- POCO X6 5G స్మార్ట్ఫోన్ డిస్కౌంట్ తర్వాత రూ.20,999 కి లభిస్తుంది.
- ఫ్లిప్కార్ట్ లో ఎక్స్చేంజ్ బోనస్ రూ.3,000 వరకు లభిస్తుంది. దీంతో యూజర్ కి ఫోన్ మరింత చవకగా రానుంది.
- POCO X6 5G స్మార్ట్ఫోన్ మిర్రర్ బ్లాక్ మరియు స్నోస్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
POCO X6 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: POCO X6 5G లో 6.67-ఇంచ్ క్రిస్టల్రెజ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే (2712*1220 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, వెట్ టచ్ డిస్ప్లే ఉన్నాయి.
- ప్రాసెసర్: POCO X6 5G లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: POCO X6 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- సాఫ్ట్వేర్: POCO X6 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
- కెమెరా: POCO X6 5G లో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఆడియో: POCO X6 5G లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో (వైర్డ్ అండ్ వైర్లెస్), 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
- బ్యాటరీ: POCO X6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కలర్ ఆప్షన్స్: POCO X6 5G మిర్రర్ బ్లాక్, స్నోస్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
