షావోమి సబ్-బ్రాండ్ POCO త్వరలో POCO X6 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ డివైజ్ బ్యూరో ఆఫర్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో పలు ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. POCO X సిరీస్ Redmi Note 13 Pro కి రీబ్రాండ్ గా వస్తున్నట్లు సమాచారం. 2023 డిసెంబర్ లో POCO X6 Pro 5G లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి POCO X6 Pro 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.
POCO X6 Pro 5G బీఐఎస్ లిస్టింగ్
POCO X6 Pro 5G డివైజ్ యొక్క బీఐఎస్ లిస్టింగ్ ని The Tech Outlook గుర్తించింది. అయితే POCO X6 Pro 5G బీఐఎస్ లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. కానీ, POCO X6 Pro 5G డివైజ్ లిస్టింగ్ పై 23122PCD1I అనే మోడల్ నంబర్ తో ఉంది. ఇకపోతే POCO X6 Pro 5G డివైజ్ ఇప్పటికే ఐఎంఈఐ డేటాబేస్ పై సేమ్ మోడల్ నంబర్ తో కనిపించింది. త్వరలోనే POCO X6 Pro 5G భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
POCO X6 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: POCO X6 Pro 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డీసీఐ-పీ3 100 పర్సెంట్ వైడ్ కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయి.
- ప్రాసెసర్: POCO X6 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్, అడ్రెనో 740 జీపీయూ ఉంటాయని అంచనా.
- మెమొరీ: POCO X6 Pro 5G లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: POCO X6 Pro 5G లో 200ఎంపి శాంసంగ్ హెచ్పి3 ప్రైమరీ 7పి లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. POCO X6 Pro 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: POCO X6 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: POCO X6 Pro 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5.2, వై-ఫై 5, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉంటాయి.
రానున్న రోజుల్లో POCO X6 Pro 5G కి సంబంధించిన మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. అలాగే భారత మార్కెట్ లాంచ్ పై కూడా ఏదైనా ప్రకటన వెలువడవచ్చు.
