Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో POCO X6 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో POCO X6 Pro మరియు POCO X6 డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్ వెబ్సైట్స్ పై లిస్ట్ అయ్యాయి. తాజాగా POCO X6 సిరీస్ యొక్క టీజర్ ని పోకో కంపెనీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సరే, ఓసారి POCO X6 సిరీస్ టీజర్ విశేషాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
POCO X6 సిరీస్ టీజర్
- POCO సంస్థ అధినేత హిమాన్శు టాండన్ సోషల్ మీడియా వేదిక X ద్వారా POCO X6 సిరీస్ యొక్క టీజర్ షేర్ చేశారు.
- కంపెనీ తాను షేర్ చేసిన పోస్ట్ లో క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు, యూజర్లకు కొత్త గిఫ్ట్ రాబోతుందని తెలిపింది.
- షేర్ కాబడిన ఇమేజ్ ని గమనిస్తే, అది X6 సిరీస్ కి సంబంధించినదని అర్థమవుతోంది.
- అయితే POCO X6 సిరీస్ లాంచ్ తేదీ మాత్రం వెల్లడి కాలేదు. 2024 జనవరిలో POCO X6 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
Happy Xmas Everyone ???
Santa is coming with the gift soon ??. pic.twitter.com/kJBfxY4CvD— Himanshu Tandon (@Himanshu_POCO) December 25, 2023
POCO X6 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: POCO X6 సిరీస్ ఫోన్లలో 6.67-ఇంచ్ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 12-బిట్ కలర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: POCO X6 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్ ఉండవచ్చు. మరోవైపు స్టాండర్డ్ మోడల్ POCO X6 లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.
- ర్యామ్, స్టోరేజీ: POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: POCO X6 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. మరోవైపు స్టాండర్డ్ వేరియంట్ POCO X6 లో కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. రెండు ఫోన్లలోనూ సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: POCO X6 Pro లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. POCO X6 లో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
- ఓఎస్: POCO X6 మరియు POCO X6 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
