ఐఎంఈఐ డేటాబేస్ పై POCO కి సంబంధించిన రెండు స్మార్ట్ఫోన్లు కనిపించాయి. త్వరలోనే ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. వీటి పేరు లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు. అయితే ఇవి POCO X6, POCO X6 Pro అయ్యుంటాయని అంచనా వేస్తున్నారు. POCO X6, X6 PRO డివైజెస్ ఇటీవలె లాంచైన Redmi Note 13, Note 13 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి ఈ రెండు పోకో ఫోన్ల యొక్క ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
POCO X6, POCO X6 Pro ఐఎంఈఐ లిస్టింగ్ వివరాలు
- 2312DRAF3G, 2312DRAF3I, 23122PCD1G అనే మోడల్ నంబర్లతో పోకో స్మార్ట్ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించాయి.
- ఈ ఫోన్లు POCO X6, POCO X6 Pro అని అంచనా వేస్తున్నారు.
- ఐఎంఈఐ డేటాబేస్ పై POCO X6 Pro మోడల్ నంబర్ 23122PCD1G అని ఉంది. ఇందులో G అంటే గ్లోబల్ మోడల్ అని అర్థం.
- మరోవైపు POCO X6 మోడల్ నంబర్స్ 2312DRAF3G, 2312DRAF3I అని ఉన్నాయి.
Redmi Note 13, Note 13 Pro స్పెసిఫికేషన్స్
POCO X6, POCO X6 Pro ఫోన్లు ఇటీవలె లాంచైన Redmi Note 13, Note 13 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా మార్కెట్ లోకి వస్తున్నట్లు సమాచారం. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.
- డిస్ప్లే: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్ ఉంది. స్టాండర్డ్ వేరియంట్ Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ వాడారు.
- మెమొరీ: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.
- కెమెరా: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ రెండింట్లోనూ 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ3 ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi Note 13 Pro లో 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మరోవైపు, Redmi Note 13 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- కనెక్టివిటీ: రెండు డివైజెస్ లోనూ డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
