
రానా దగ్గుబాటి.. బాహుబలి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అంతకు ముందు పలు చిత్రాల ద్వారా హిందీ చిత్ర పరిశ్రమకు, ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన రానా క్రేజ్ బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో ఆకాశాన్ని తాకింది. రానా నుంచి వచ్చిన ఇటీవలి చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. అయితే తాజాగా తన బాబాయ్ విక్టరీ వెంకటేశ్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రానా.
మరోవైపు విక్టరీ వెంకటేశ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎఫ్ 2 చిత్రంతో వెంకటేశ్ భారీ విజయం అందుకొని తన కామెడీ టచ్ తో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాగే అసురన్ రీమేక్ నారప్ప లో ఎమోషనల్ రోల్ లో నటించి మరొకసారి అందరి మనసులను కదిలించారు వెంకీ. నెక్ట్స్ వెంకటేశ్ సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈయన రానా దగ్గుబాటితో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ లో రానా, వెంకటేశ్ తండ్రీ కొడుకులుగా నటించారు.
Netflix లో ప్రసారం కానున్న రానా నాయుడు
రానా నాయుడు వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ లో వెంకీ, రానా తండ్రీ కొడుకులుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అందరూ ఈ వెబ్ సిరీస్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 10 నుంచి ప్రసారం కానుంది.
అమెరికన్ టివి సిరీస్ ‘రే డొనోవన్’ ఆధారంగా రానా నాయుడు వెబ్ సిరీస్ రూపొందింది. లొకొమొటివ్ గ్లోబల్ ఐఎన్‌సీ బ్యానర్ పై సుందర్ ఆరొన్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు. రానా నాయుడు కి కరణ్ అన్శుమన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. మోహిత్ షా, పర్ల్ గిల్ ఈ వెబ్ సిరీస్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహించారు. అనన్యా మోడీ కథను సమకూర్చారు.
రానా నాయుడు తారాగణం
రానా నాయుడు వెబ్ సిరీస్ లో రానా దగ్గుబాటి, సుర్విన్ చావ్లా, దగ్గుబాటి వెంకటేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. జెస్సికా హరిసన్, సుచిత్రా పిళ్ళై, రాజేశ్ జెయిస్, గౌరవ్ చోప్రా, ఆశిశ్ విద్యార్థి, సుశాంత్ సింగ్, అశ్విన్ ముశ్రన్, అభిషేక్ భలేరావ్ ప్రధాన పాత్రలు పోషించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











