Home News రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఓటీటీ అప్డేట్

రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఓటీటీ అప్డేట్

హైలైట్స్

మాస్ మహారాజా రవితేజ చిత్రమంటే యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మాంచి బజ్ ఉంటుంది. ఇంటిల్లిపాది కలిసి చూసే విధంగా రవితేజ సినిమాలు ఉంటాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టెయినర్లకు కేరాఫ్ అడ్రస్ మాస్ రాజా రవితేజ. అయితే ఇటీవలి కాలంలో సరైన హిట్టు లేక రవితేజ ఢీలా పడిపోయారు.

కానీ, తాజాగా వచ్చిన ధమాకా చిత్రంతో త్రినాథ రావు నక్కిన, మాస్ మహారాజా రవితేజకి బంపర్ హిట్ ఇచ్చారు. తొలుత ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆడియన్స్ మౌత్ టాక్ వల్లన తర్వాత మెల్లగా పుంజుకుంది. ఇక రవితేజ చిత్రం థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించడం మొదలు పెట్టింది. మాస్ అంశాలు పుష్కలంగా ఉండటం, రవితేజ యాక్షన్, శ్రీలీల అందం, భీమ్స్ సంగీతం, దర్శకుడి ప్రతిభ వెరసి ధమాకా పేరుకి తగినట్లుగానే అందరికీ ధమాకా హిట్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.

ధమాకా మూవీ ఓటీటీ పార్ట్నర్

ఒక చిత్రం థియేటర్లలో సక్సెస్ అయ్యిందంటే ఆ చిత్రానికి ఓటీటీ సైట్స్ నుంచి భారీ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ధమాకా చిత్రం యొక్క డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ధమాకా తన థియెట్రికల్ రన్ ముగించాక నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. థియేటర్లలో చిత్రాన్ని చూడలేని వారికి, మరోసారి ఫ్యామిలీతో కలిసి చిత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ధమాకా ఓటీటీ మాధ్యమం లోకి వచ్చేస్తోంది. ధమాకా రాకతో ఇక ఓటీటీ ఆడియన్స్ కి పండగేనని చెప్పాలి.

రవితేజ, శ్రీలీల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ధమాకా చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. తనికెళ్ళ భరణి, తులసి, సచిన్ ఖేడేకర్, పవిత్ర లోకేశ్, అలీ, రావు రమేశ్, హైపర్ ఆది తదితరలు కీలక పాత్రలు పోషించారు.

విదేశాల్లో ధనాధన్ ‘ధమాకా’

రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ధమాకా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా తన సత్తా చూపెడుతోంది. నిజానికి, మాస్ మసాలా చిత్రాలకు ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ ఉండదు. కానీ మాస్ మహారాజా చిత్రానికి అక్కడి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.

రవితేజ కెరీర్ లో ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా ధమాకా నిలుస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మాస్ మహారాజా తన ఖాతాలో చాలా కాలం తర్వాత హిట్ వేసుకోవడమే గాక, జనాలను కూడా విపరీతంగా అలరిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.